Dulquer Salmaanకు జరిగినట్లే నాకూ జరిగింది: నటి కస్తూరి సంచలన కామెంట్స్

by Disha Web Desk 9 |
Dulquer Salmaanకు జరిగినట్లే నాకూ జరిగింది: నటి కస్తూరి సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అప్పట్లో ‘భారతీయుడు’ చిత్రంలో కమల్ హాసన్ చెల్లెలిగా నటించి ప్రేక్షకులను ఎంతగాలో మెప్పించింది నటి కస్తూరి శంకర్. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘అన్నమయ్య’ సినిమాతో పాటు పలు సినిమాల్లో నటించింది. 1990వ దశకంలో సౌత్ చిత్రాల్లో సత్తా చాటిన ఈ బ్యూటీ ప్రస్తుతం ‘గృహలక్ష్మీ’ సీరియల్‌లో నటిస్తూ.. బుల్లితెరపై సందడి చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత, వృత్తిపర విషయాలను పంచుకుంటుంది. అయితే ‘సీతారామం’ చిత్రంతో మంచి క్రేజ్ దక్కించుకున్న హీరో దుల్కర్ సల్మాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై.. తనకు స్టేజ్‌పై ఎదురైనా ఓ చేదు అనుభవాన్ని గురించి వెల్లడించారు.

‘స్టేజ్‌పై ఉండగా ఓ పెద్దావిడ తన ప్రవేటు పార్ట్ వద్ద అసభ్యకరంగా తాకిందంటూ’ చెప్పారు. తాజాగా కస్తూరి.. దుల్కర్ సల్మాన్‌లానే తనకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురయ్యిందంటూ చెప్పుకొచ్చింది. ‘‘ఓ ప్రముఖ సంస్థ సెలబ్రిటీలందరినీ పిలిచి ఓ ఈవెంట్ నిర్వహించింది. నటీనటులను చూడ్డానికి ఈ కార్యక్రమానికి జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అప్పుడు ఓ వ్యక్తి ఆమెను బ్యాక్ నుంచి నొక్కినట్లు తెలిపింది. వెంటనే అతడి చేతులు పట్టుకుని ముందుకు లాగి చెంపపై ఒక్కటి ఇచ్చిందట. దీంతో అతడు అక్క సారీ అంటూ గట్టిగా ఏడ్చాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story

Most Viewed