రాజకీయాల్లోకి రావడంపై రిషబ్ శెట్టి.. త్వరలోనే..

by Disha Web Desk 10 |
రాజకీయాల్లోకి రావడంపై రిషబ్ శెట్టి.. త్వరలోనే..
X

దిశ, సినిమా: గత ఏడాది బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన చిత్రంలో ‘కాంతార’ ఒకటి. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ కన్నడ సినిమా ఇంటర్నేషనల్ లెవల్‌లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీతో రిషబ్ శెట్టి దేశవిదేశాల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. కాగా తాజాగా రిషబ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై తాజాగా స్పందించిన రిషబ్.. ‘నా రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారం అంతా అబద్దమే. గతంలో అలాగే ప్రచారం జరిగింది. తమ పార్టీకి మద్దతివ్వాలని కొంతమంది రాజకీయ నేతలు అడుగుతున్నారని ప్రచారం చేశారు. కానీ నా దృష్టి మొత్తం సినిమాలపైనే ఉంది. నేను రాజకీయాల్లోకి వస్తున్నా అనే వార్త విని నా అభిమానులు రాజకీయాల్లోకి వస్తే అండగా ఉంటానంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఆ మాట అన్నారు నాకు అదే చాలు. కానీ ఇప్పటికీ నా సినిమాలకు అండగా ఉంటూ థియేటర్లకు వెళ్లి చూడాలని కోరుకుంటున్నాను’ అని రిషబ్ శెట్టి అభిమానులు కోరారు.

ఇవి కూడా చదవండి: Nagma: ఇన్నేళ్ళకు బయట పడిన నగ్మా, రవికిషన్.. ఎఫైర్

Next Story