Nagma: ఇన్నేళ్ళకు బయట పడిన నగ్మా, రవికిషన్.. ఎఫైర్

by Disha Web Desk 10 |
Nagma: ఇన్నేళ్ళకు బయట పడిన నగ్మా, రవికిషన్.. ఎఫైర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్‌గా అనతి కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు రవికిషన్. ఇక ఈ మధ్య కాలంలో తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయట పడుతున్నాయి. అయితే గతంలో సీనియర్ హీరోయిన్ నగ్మా, రవి కిషన్ మధ్య ఎఫైర్ ఉందని వార్తలు జోరుగా వినిపించాయి. కాగా తాజా ఇంటర్వ్యూలో రవి కిషన్ మాట్లాడుతూ.. ఇందుకు సంబంధించిన విషయాలు వెల్లడించాబు. ‘నగ్మా, నేను కలిసి చేసిన సినిమాలు చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. దాన్ని చూసి అందరూ మా మధ్య ఏదో ఉందని పుకార్లు పుట్టించారు. నాకు పెళ్లైంది నా భార్య పేరు ప్రీతి శుక్లా. ఆమె అంటే నాకు ఎంతో గౌరవం. నా దగ్గర డబ్బులు లేని సమయంలో కూడా నాతో ఉంది. నమ్మరు కానీ నా భార్య పాదాలకు ఇప్పటికీ నమస్కరిస్తాను’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి: రాజకీయాల్లోకి రావడంపై రిషబ్ శెట్టి.. త్వరలోనే..



Next Story

Most Viewed