దేవుడి రాజ్యంలోకి వెల్కమ్.. 'నాగబంధం' సాంగ్ షేర్ చేస్తూ నభా నటేష్ క్రేజీ క్యాప్షన్!

by Mallepaka Hamsa |

‘నాగబంధం’ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ‘నమో రే నమో రే’ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

దేవుడి రాజ్యంలోకి వెల్కమ్.. నాగబంధం సాంగ్ షేర్ చేస్తూ నభా నటేష్ క్రేజీ క్యాప్షన్!
X

దిశ, సినిమా: యంగ్ హీరో విరాట్ కర్ణ, అందాల భామలు నభా నటేష్, ఐశ్వర్య మేనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ ‘నాగబంధం’ (Nagabandham). ప్రముఖ నిర్మాత దర్శకుడు అభిషేక్ నామా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ మేకర్స్ మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ.. అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ‘నాగబంధం’ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ ‘నమో రే నమో రే’ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాట వింటుంటేనే ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతోంది. శ్రీహర్ష ఈ పాటకు అర్థవంతమైన లిరిక్స్ అందించగా, జునైద్ కుమార్ తన గాత్రంతో ఈ భక్తి గీతాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. ఒక ఆధ్యాత్మిక ఇతిహాసంతో సాగే ఈ కథలో ఈ పాట చాలా కీలకం కానుందని తెలుస్తోంది.

ఈ పాటను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నభా నటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. " ఒక ఆధ్యాత్మిక ఇతిహాసంతో భక్తి, దేవుడి రాజ్యంలోకి ప్రవేశించండి.." అంటూ ఆమె ఇచ్చిన క్యాప్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రమాదం తర్వాత మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఈ రేంజ్ ప్రాజెక్ట్‌తో మొదలుపెట్టడం విశేషం. ఈ సినిమాలో నభా ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తుందని సమాచారం. ఈ సినిమాలో వెర్సటైల్ నటులు జగపతి బాబు, భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరి పాత్రలు కథను మలుపు తిప్పే విధంగా ఉంటాయని టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అత్యున్నత సాంకేతిక విలువలలో, గ్రాఫిక్స్ ,విజువల్ ఎఫెక్ట్స్‌తో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘నమో రే నమో రే’ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండటంతో సినిమాపై బజ్ మరింత పెరిగింది.

Next Story