పెళ్లి ఫొటోలు డిలీట్.. నిహారిక-చైతన్య మధ్య విభేదాలు వచ్చాయా..?

by Disha Web Desk 6 |
పెళ్లి ఫొటోలు డిలీట్.. నిహారిక-చైతన్య మధ్య విభేదాలు వచ్చాయా..?
X

దిశ, వెబ్ డెస్క్: మెగా డాటర్ నిహారిక బుల్లితెర యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నిర్మాతగా మారి ఇండస్ట్రీలో రాణిస్తుంది. అయితే 2020 డిసెంబర్‌లో చైతన్య జొన్నలగడ్డని పెళ్లి చేసుకుని అప్పటినుంచి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. అంతేకాకుండా వీరిద్దరు నిత్యం ఓకేషన్స్‌కు తిరుగుతూ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు. కానీ, గత కొద్ది కాలంగా నిహారిక, చైతన్య సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా, చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి పెళ్లి ఫొటోలతో పాటు నిహారిక ఫొటోలను డిలీట్ చేసి ఒకే ఒక్క ఫొటోను పెట్టుకున్నాడు. అంతేకాకుండా నిహారిక, చైతన్య ఒకరినొకరు అన్‌ఫాలో కూడా చేసుకున్నారట. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని త్వరలో విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే ఆ జంటలో ఎవరో ఒకరు అధికారికంగా స్పందించాల్సిందే.

Also Read.:. Mega Heroes: కోలీవుడ్ వైపు చూస్తున్న మెగా ఫ్యామిలీ? ఎందుకో తెలుసా?

Next Story

Most Viewed