మెగా ఇంట్లో పెళ్లి సందడి స్టార్ట్.. నాగబాబు నివాసానికి విచ్చేసిన అతిథులు

by Disha Web Desk 9 |
మెగా ఇంట్లో పెళ్లి సందడి స్టార్ట్.. నాగబాబు నివాసానికి విచ్చేసిన అతిథులు
X

దిశ, వెబ్‌డెస్క్: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు(జూన్ 9) న ‘‘ రెండు గుండెలు ఒక ప్రేమ.. అని ప్రింట్ చేయించిన నిశితార్థం కార్డు ఓ మీడియా ప్రతినిధి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ‘ మీరు జీవితాంతం బాగుండాలి’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై మెగా ఫ్యామిలీ కూడా అధికారికంగా ప్రకటించింది. అయితే వరుణ్ లావణ్య త్రిపాఠి’’ ఎంగేజ్‌మెంట్‌ ఈ రోజు హైదరాబాదు మణికొండలోని పామ్ బ్రీజ్ గేటెడ్ కమ్యూనిటీలోని నాగబాబు ఇంటి వద్దనే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పటికి పూజా కార్యక్రమాలు మొదలవ్వగా.. రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ తో సహా మరికొంతమంది సన్నిహితులు నిశ్చితార్థ వేడువలో హాజరయ్యి.. మెగా హీరోలందరూ ఈ ఈవెంట్‌లో సందడి చేస్తున్నారు. వరుణ్, లావణ్య ఎంగేజ్‌మెంట్ పూర్తి అయ్యాక పెళ్లి డేట్ అనౌన్స్ చేస్తారట. ఈ ఏడాది నవంబరు లేదా డిసెంబరు‌లో వీరిద్దరి వివాహం ఉంటుందని సమాచారం.

Also Read:

మరికాసేపట్లో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం

Next Story