- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లు వారింట పెళ్లి సందడి షురూ.. వీడియో వైరల్
అల్లు శిరీష్ ఇంట్లో ఘనంగా పసుపు దంచుడు కార్యక్రమం నిర్వహించారు.

దిశ, సినిమా: మెగా కాంపౌండ్ నుంచి మరో హీరో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, యంగ్ హీరో అల్లు శిరీష్(Allu Sirish)త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. గత కొంతకాలంగా నయనిక (Nayanika)అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న శిరీష్, పెద్దలను ఒప్పించి తన కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు. సాధారణంగా సినీ సెలబ్రిటీల పెళ్లిళ్లు అంటే ఆర్భాటాలు, హంగులు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ అల్లు శిరీష్ మాత్రం సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ.. తన వివాహ వేడుకలను జరుపుకుంటున్నారు. ఇప్పటికే గత ఏడాది వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. గత నెలలో దుబాయ్ వేదికగా ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకోగా, తాజాగా హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా పసుపు దంచుడు కార్యక్రమం నిర్వహించారు. నేటి కాలంలో ట్రెండ్ పేరిట చేసే ‘హల్దీ’ వేడుకల కంటే, మన తెలుగు సంప్రదాయ పద్ధతిలో ఈ కార్యక్రమం నిర్వహించడం విశేషం.
మెరిసిన మెగా, అల్లు కుటుంబాలు:
ఈ పసుపు దంచుడు వేడుకలో అల్లు, మెగా కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు. అల్లు శిరీష్ స్వయంగా ఈ వేడుకకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వేడుకలో అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి, పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా, చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శిరీష్ షేర్ చేసిన వీడియో చూసిన అభిమానులు, నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సంప్రదాయబద్ధంగా, సింపుల్‌గా ఈ వేడుకను నిర్వహించుకోవడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.






