- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.. ‘మెగా-157’ చిత్రబృందం స్ట్రాంగ్ వార్నింగ్
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి (Anil Ravipudi)కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి (Anil Ravipudi)కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. ‘మెగా-157’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ బ్యానర్స్‌పై చిరంజీవి పెద్ద కూతురు సుస్మితా నిర్మిస్తోంది. ఈ మూవీలో మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కేరళ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇక ఇందుకు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పలు పుకార్లు షికారు చేస్తున్నాయి.
తాజాగా, నిర్మాణ సంస్థ ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. అనధికారికంగా పలు సీన్స్ రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘మా సినిమాకు సంబంధించిన కొన్ని అనధికార వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయని మాకు తెలిసింది. మా అనుమతి లేకుండా సెట్స్ నుంచి కంటెంట్ రికార్డు చేయొద్దని కోరుతున్నాము. అలా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము.
ఇలాంటి పనులు చేయడం వల్ల షూటింగ్‌కు అంతరాయం కలగడమే కాకుండా దీని కోసం పని చేస్తున్న టీమ్ అందరినీ బాధ పెట్టినట్లే అవుతుంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఎవరూ షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతో ప్రేమతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. అధికారిక సమాచారాన్ని మాత్రమే షేర్ చేయాలని అభిమానులను కోరుతున్నాము. ఈ ప్రాజెక్ట్ సమగ్రతను కాపాడటానికి కలిసి పనిచేద్దాం. మీ అవగాహన, మద్దతును మేము అభినందిస్తున్నాము’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






