- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా హీరోయిన్లను బాడీ షేమింగ్ చేస్తే ఊరుకునేది లేదు.. కఠిన చర్యలు తీసుకుంటామంటూ నిర్మాత వార్నింగ్
దయానంద్(Dayanand) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వర్జిన్ బాయ్స్’(Virgin Boys).

దిశ, సినిమా: దయానంద్(Dayanand) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వర్జిన్ బాయ్స్’(Virgin Boys). గీతానంద్, మిత్రా శర్మ (Mitra Sharma)ప్రధాన పాత్రలో నటించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను రాజ్ గురు ఫిలిమ్స్ బ్యానర్‌పై రాజా దరపునేని నిర్మించారు. ఇందులో శ్రీహాన్, జెన్నిఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షులు కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా జూలై 11న థియేటర్స్‌లో విడుదలైంది. ఇక ఈ చిత్రాన్ని చూసిన యూట్యూబర్లు, నెటిజన్లు కొందరు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఓ వ్యక్తి ఇందులో నటించిన హీరో, హీరోయిన్ల గురించి దారుణంగా మాట్లాడుతున్నారు. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత రాజా సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ‘‘అందరూ ఇండస్ట్రీ మీదనే బతుకుతున్నారు. కొంతమంది సినిమా రిలీజ్ అవ్వకముందే రివ్యూలు పెట్టారు.
ఇప్పుడు ‘వర్జిన్ బాయ్స్’ మూవీతో వాడు కూడా ఫేమస్ అవ్వాలని చూస్తున్నాడు. వేరే సినిమాల గురించి పెట్టలేదు. అవి చూసి పెట్టొచ్చు కదా. అతను యూట్యూబ్‌లో దారుణంగా మాట్లాడాడు. మా హీరోయిన్స్ అందం గురించి మాట్లాడే ముందు అతన్ని ముఖాన్ని అందంలో చూసుకోవాలి. అమ్మాయిల గురించి బాడీ షేమింగ్ చేస్తే ఇక అంతే బయటకు రారు తీహార్ జైలుకే వెళతారు. లిమిట్ క్రాస్ చేసి మాట్లాడినా రివ్యూలు పెట్టినా సెక్షన్స్ చాలా ఉన్నాయి. మనవాల్లు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు కానీ నాలాంటి తిక్కలోడు ఎవడో తగులుతాడు. నేను వచ్చేముందే సెంట్రల్ మినిస్టర్స్, ఆఫీసర్లతో ఏం చేయాలని మాట్లాడి వచ్చాను.
కొద్దిగా అలర్ట్‌గా ఉండండి ఎట్ల పడితే అట్ల రాయకండి. తులసి తోటలో గంజాయి మొక్కల్లాంటి వాళ్ళు కొంత మంది జర్నలిస్టులు ఉన్నారు. వాల్లు అసలు జర్నలిస్టులే కాదు.. ఎక్కడో విరిగిపోయిన చైర్‌లో కూర్చొని వెబ్‌సైట్, యూట్యూబ్ పెట్టి వాడు సినిమా చూడకముందే ట్రైలర్, టీజర్ కట్ చేసి మరీ నిర్మాతలను డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. పరాన్న జీవుల్లా బ్రతుకుతున్నారు. మా యాక్టర్స్ గురించి చెడుగా మాట్లాడితే ఊరుకోము కఠిన చర్యలు తీసుకుంటాము. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నిర్మాత జర్నలిస్టులపై చేసిన కామెంట్స్ వివాదాస్పద మవుతున్నాయి.






