- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డబ్బు కోల్పోతామని అనుకున్నాము.. అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు: దుల్కర్ సల్మాన్
మలయాళ యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan), నస్లీన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘లోకా చాప్టర్-1’(Loka Chapter-1).

దిశ, సినిమా: మలయాళ యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan), నస్లీన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘లోకా చాప్టర్-1’(Loka Chapter-1). డొమినిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)తన సొంత బ్యానర్ వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు. సూపర్ హీరో యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా ఆగస్టు 28న థియేటర్స్‌లోకి వచ్చింది. మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. బాక్సాఫీసు వద్ద ఊహించని కలెక్షన్లు రాబడుతూ దూసుకుపోతుంది. అలాగే పలువురు సెలబ్రిటీల ప్రశంసలు అందుకుంటోంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్ సల్మాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
‘‘నిర్మాతగా, మేము Lokahతో డబ్బు కోల్పోతామని అనుకున్నాము. ఇది మంచి సినిమా అని మాకు తెలుసు. కానీ బడ్జెట్ ఎక్కువ పెట్టడంతో& కొనుగోలుదారులు ఆసక్తి చూపడం లేదు. ఈ ఫ్రాంచైజీ స్థాపించబడితే, మేము లాభం పొందవచ్చని నేను అనుకున్నాను. కానీ ఈ విజయం ఊహించలేనిది. ‘లోకా’ సినిమాతో చాలా పెద్ద రిస్క్ చేశాం. ఎందుకంటే విడుదలకు ముందు కొనుగోలుదారులు ఎవరూ లేరు. దీంతో మొదటి సినిమా నష్టపోతుందని భయపడ్డాము. సీక్వెల్స్ ద్వారా కోలుకోవాలని ఆశపడిన నేను అది రికార్డులను బద్దలు కొడుతోందని అనుకోలేదు’’ అని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






