మనం ఇలాంటివి ఎన్నో చేయాలి ‘దసరా’ సినిమాపై ప్రభాస్ స్పెషల్ పోస్ట్..

by Disha Web Desk 6 |
మనం ఇలాంటివి ఎన్నో చేయాలి ‘దసరా’ సినిమాపై ప్రభాస్ స్పెషల్ పోస్ట్..
X

దిశ, వెబ్ డెస్క్: న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘దసరా’. దీనికి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. భారీ కలెక్షన్లు వసూల్ చేస్తూ ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతుంది. నాని కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్, హైయెస్ట్ కలెక్షన్స్ సినిమాగా దసరా నిలిచింది. అయితే ఈ మూవీపై పలువురు సినీ ప్రముఖులు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. ‘‘ ఇప్పుడే దసరా సినిమా చూశాను. సినిమా చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. ఈ సినిమా చేసినందుకు నానికి నా అభినందనలు. నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, కీర్తి సురేష్, మిగిలిన టీం అంతా బాగా వర్క్ చేశారు. మనం ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చేయాలి’’ అంటూ దసరా పోస్టర్‌ను షేర్ చేశాడు.

ఇవి కూడా చదవండి:

మళ్లీ ‘దసరా’ లాంటి సినిమా చేయను.. నాని

Dasara Movie: ‘ద‌స‌రా’ మూవీ టికెట్ రేట్లు త‌గ్గించేశారు





Next Story

Most Viewed