ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ‘డైమండ్ డెకాయిట్’ చేశాం.. మీ అందరి సపోర్ట్ కావాలి

by Mallepaka Hamsa |

హీరో పార్ధ గోపాల్(Parth Gopal), హీరోయిన్ మేఘన(Meghana) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డైమండ్ డెకాయిట్’(Diamond Decoit).

ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ‘డైమండ్ డెకాయిట్’ చేశాం.. మీ అందరి సపోర్ట్ కావాలి
X

దిశ, సినిమా: హీరో పార్ధ గోపాల్(Parth Gopal), హీరోయిన్ మేఘన(Meghana) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డైమండ్ డెకాయిట్’(Diamond Decoit). హైదరాబాద్ ప్రసాద్ ఘల్యాబ్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో విన్నూత్నంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న.. హీరో పార్ద గోపాల్ మాట్లాడుతూ.. ‘‘నేను మా డైరెక్టర్ సూర్య జి యాదవ్ గారు గత మూడు సంవత్సరాల నుండి జర్నీ చేస్తూ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అందరి సమక్షంలో టీజర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ‘డైమండ్ డెకాయిట్’ ఒక ఫ్యామిలీ ఎమోషనల్ రివెంజ్ డ్రామా 2026 ఫిబ్రవరి లో ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నాం మీ అందరి సపోర్ట్ కావాలి’’ అని అన్నారు. అనతంరం హీరోయిన్ మేఘన మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం చాలా కష్టపడి పని చేశాము. ముఖ్యంగా మా డైరెక్టర్ గారు, హీరో &ప్రొడ్యూసర్‌గా చేసిన పార్ద గోపాల్ గారు అందరూ కష్టపడి పని చేశారు. మాకు మీ అందరి సపోర్ట్ కావాలి’’ అని విజ్ఞప్తి చేసింది.

Next Story