- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ బ్యానర్‌పై టాలెంట్ ఉన్న అందర్నీ ప్రోత్సహించాలని భావిస్తున్నాము: విజయ భారతి
విజయ భారతి నిర్మిస్తున్న ఈ కొత్త చిత్రాన్ని ప్రొడక్షన్ 1గా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు.

దిశ, సినిమా: ఆర్యా (Arya)హీరోగా పోలూరు కృష్ణ (Poluru Krishna)దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోంది. ఈ చిత్రంలో దశరథ్(Dasaratha), వాసుకి, ఆడుకలం నరేన్(Naren), సమ్మిట గాంధీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ విజయ వారాహి మూవీస్ బ్యానర్‌పై మురుకుంట్ల అరవింద్, విజయ భారతి నిర్మిస్తున్న ఈ కొత్త చిత్రాన్ని ప్రొడక్షన్ 1గా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి దశరథ్ క్లాప్ కొట్టారు. నిర్మాత విజయ భారతి కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాతలు టీంకు స్క్రిప్ట్ అందజేశారు. నిర్మాత విజయ భారతి మాట్లాడుతూ.. ఈ బ్యానర్‌పై టాలెంట్ ఉన్న అందర్నీ ప్రోత్సహించాలని భావిస్తున్నాము. ఆర్యాకి నటన అంటే ఇంట్రెస్ట్ ఉందని తెలియగానే మేము చాలా ప్రోత్సహించాం. ఒకరోజు డెమో షూట్ చేశారు. 100% తను ఒక మంచి నటుడని అనిపించాకే తీసుకున్నారు. మా సంస్థ ద్వారా కొత్త వారికి కూడా అవకాశాలు ఇస్తామని తెలిపారు.






