హీరోలతో సమానంగా మ్మమ్మల్ని చూడాలి.. ఇండస్ట్రీలో మార్పులు రావాలంటూ కృతి సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనన్(Kriti Sanon) ‘తేరే ఇష్క్ మెయిన్’(Tere Ishq Main) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

హీరోలతో సమానంగా మ్మమ్మల్ని చూడాలి.. ఇండస్ట్రీలో మార్పులు రావాలంటూ కృతి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనన్(Kriti Sanon) ‘తేరే ఇష్క్ మెయిన్’(Tere Ishq Main) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో స్టార్ హీరో ధనుష్ (Dhanush)హీరోగా నటిస్తుండగా.. ఆనంద్ ఎల్ రాయ్ (Anand L. Rai)దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్‌లో విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాతో పాటు కృతి ‘కిల్ బిల్’లోనూ నటిస్తోంది. అంతేకాకుండా పలు యాడ్స్ కూడా చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. తాజాగా, కృతి సనన్ ‘ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్’ ఇండియాకు లింగ సమానవ్త గౌరవ రాయబారిగా ఎంపికైంది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ‘‘ఇండస్ట్రీలో సమానత్వం చూపించడం లేదు. సౌకర్యం విషయంలోనే కాకుండా నటీనటులను గౌరవించడంలోనూ అదే ధోరణి కనిపిస్తోంది. హీరోలకు పెద్ద కార్లు, విలాసవంతమైన గదులు ఇస్తున్నారు.

ఇది చాలా చిన్న విషయం అయినప్పటికీ నాకు బాధ కలుగుతోంది. కేవలం ఇలాంటి విషయాన్నో కాకుండా ఇండస్ట్రీలో కొందరు మహిళలను తక్కువ చేసి చూస్తారు. హీరోలతో సమానమైన గౌరవానికి మేం కూడా అర్హులమే. షూటింగ్ విషయంలోనూ ఇలానే జరుగుతుంది. హీరోలు సెట్‌కు ఆసల్యంగా వచ్చినా.. వారి కోసం మేము వెయిట్ చేయాలి. మాకు మాత్రం అలాంటివి ఉండవు. అసిస్టెంట్ డైరెక్టర్ ముందే సెట్‌కి వచ్చి ఉండాలని చెప్తారు. హీరోలకు మాత్రం ఆ మాట చెప్పరు. ఇలాంటి ఆలోచనా విధానంలో మార్పు రావాలి. హీరోలతో సమానంగా మమ్మల్ని కూడా ట్రీట్ చేయాలి. వారిలా మేము కూడా కష్టపడుతున్నాం’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story