- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కీర్తి సురేష్ అసలు రంగు బయటపెట్టిన సమంత.. అర్థరాత్రి ఆమెను తట్టుకోలేమంటూ షాకింగ్ కామెంట్స్!
అసలు డ్రింక్ చేయకుండానే కీర్తి ఆ సమయంలో హైపర్ మ్యాక్స్ మోడ్‌లో ఉంటుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్‌ను అత్యంత జోరుగా ప్రారంభిస్తోంది. గత ఏడాది ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరును రెండో పెళ్లి చేసుకున్న సామ్, ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ సినిమాలపైనే పెట్టింది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న సమంత, తన సహనటి, స్నేహితురాలు కీర్తి సురేష్ గురించి చేసిన కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేష్‌లోని అసలు కోణాన్ని బయటపెడుతూ సమంత ఆసక్తికర విషయాలు పంచుకుంది. "కీర్తి సురేష్ అర్థరాత్రి 2 గంటల సమయంలో కూడా ఎంతో ఉత్సాహంగా, ఫన్నీగా మాట్లాడుతుంది. ఆ టైమ్‌లో ఆమె ఎనర్జీ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆమె నవ్వులు, అల్లరి తట్టుకోలేక భయంతో అక్కడి నుండి పరిగెత్తాలి అనిపిస్తుంది. అయితే, అలా అని ఆమె మద్యం సేవించి అలా చేస్తుందని అనుకోకండి..
అసలు డ్రింక్ చేయకుండానే కీర్తి ఆ సమయంలో హైపర్ మ్యాక్స్ మోడ్‌లో ఉంటుంది" అని సమంత చెప్పుకొచ్చింది. అంతేకాకుండా, కీర్తికి అద్భుతమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని సమంత ప్రశంసించింది. "ఆమె కేవలం 0.03 సెకన్లలోనే ఎదుటివారిని తన మాటలతో డిస్ట్రాయ్ చేయగలదు. కీర్తి చాలా బెస్ట్ పర్సన్" అంటూ కీర్తి సురేష్‌లోని కామెడీ యాంగిల్‌ను సామ్ పరిచయం చేసింది. ఎప్పుడూ పద్ధతిగా, హోమ్లీగా కనిపించే కీర్తి సురేష్ గురించి సమంత ఇలాంటి క్రేజీ విషయాలు చెప్పడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. కాగా.. వీరిద్దరూ కలిసి బ్లాక్ బస్టర్ హిట్ ‘మహానటి’ చిత్రంలో కలిసి నటించారు. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ హీరోలుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయడంతో పాటుగా.. బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
సంగీత్ శోభన్ ‘రాకాస’ మూవీ రివ్యూ.. మెగా డాటర్ నిహారిక మరో హిట్ కొట్టినట్టేనా?






