సంగీత్ శోభన్ ‘రాకాస’ మూవీ రివ్యూ.. మెగా డాటర్ నిహారిక మరో హిట్ కొట్టినట్టేనా?

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-03 11:38:49  IST  )

ఈ సినిమాకు సంగీత్ శోభన్ మ్యాన్ ఆఫ్ ది షో అని చెప్పొచ్చు. తనదైన మార్క్ కామెడీ టైమింగ్‌తో థియేటర్లలో నవ్వులు పూయించాడు.

సంగీత్ శోభన్ ‘రాకాస’ మూవీ రివ్యూ.. మెగా డాటర్ నిహారిక మరో హిట్ కొట్టినట్టేనా?
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో, యంగ్ సెన్సేషన్ సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రాకాస’. మానస శర్మ దర్శకత్వంలో హారర్, కామెడీ, ఫాంటసీ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం నేడు థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తోంది. సినిమా ఆద్యంతం వినోదాన్ని పంచుతూ, ఎక్కడా బోర్ కొట్టించకుండా సాగడం ఈ చిత్రానికి అతిపెద్ద ప్లస్ పాయింట్. ఈ సినిమాకు సంగీత్ శోభన్ మ్యాన్ ఆఫ్ ది షో అని చెప్పొచ్చు. తనదైన మార్క్ కామెడీ టైమింగ్‌తో థియేటర్లలో నవ్వులు పూయించాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్ ఎంట్రీ తర్వాత వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియెన్స్‌కి ఫుల్ ఫన్ మీల్స్ అని చెప్పాలి. హీరోయిన్ నయన్ సారిక తన రోల్‌లో చాలా డీసెంట్‌గా నటించి మెప్పించింది.

ఇక బ్రహ్మ రాక్షసుడి పాత్రలో నటించిన నటుడు ఆ పాత్రకు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యి భయపడేలా చేశారు. బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, గెటప్ శ్రీను తమ అనుభవంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. దర్శకురాలు మానస శర్మ కథనాన్ని చాలా గ్రిప్పింగ్‌గా డిజైన్ చేసుకున్నారు. థ్రిల్ ఇచ్చే హారర్ ఎలిమెంట్స్‌తో పాటు సాలిడ్ ఫన్‌ని జనరేట్ చేయడంలో ఆమె సక్సెస్ అయ్యారు. అనుదీప్ దేవ్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూవీ మూడ్‌ని బాగా ఎలివేట్ చేశాయి. ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఆర్ట్ వర్క్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. మెగా డాటర్ నిహారిక నిర్మాణ విలువలు సినిమాను చాలా రిచ్‌గా మార్చాయి. మొత్తం మీద, ఈ వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకుంటూ, థ్రిల్ అవ్వడానికి ‘రాకాస’ ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. మొత్తానికి ఈ సినిమా 3.5 రేటింగ్‌తో బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. నిహారిక రెండో చిత్రం కూడా హిట్ అయ్యేలా కనిపిస్తోంది.

సినిమా కథ విషయానికి వస్తే.. వీరబాబు (సంగీత్ శోభన్) ఒక సాధారణ యువకుడు . ప్రేమించిన అమ్మాయి కోసం అమెరికా నుంచి ఎంతో హుషారుగా ఊరికి తిరిగొస్తాడు. అయితే అప్పటివరకు తనని ఫోన్ కాల్స్‌లో నవ్విస్తూ, ముద్దు ముద్దుగా మాట్లాడిన ఆ అమ్మాయి మరొకరితో పెళ్లీ పీటలెక్కేందుకు సిద్ధమవుతుంది. దీంతో ఆ విషయం తెలుసుకున్న వీరబాబు ఆ పెళ్లిని ఆపాలని ప్రయత్నాడు. అందులో భాగంగా తనతో చిన్నప్పుడు చదువుకున్న అమ్మాయి సుబ్బలక్ష్మిని కలుసుకుంటాడు. చివరకి వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఇక తన జీవితంలో సెటిల్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో అనుకోకుండా ఒక పురాతనమైన, గంభీరమైన బంగ్లాలోకి ప్రవేశించాల్సి వస్తుంది. అయితే ఆ బంగ్లాలో ఒక 'బ్రహ్మ రాక్షసుడు' బందీ అయి ఉంటాడు. వీరబాబు పొరపాటున ఆ రాక్షసుడిని నిద్రలేపడంతో కథలో అసలైన ట్విస్ట్ మొదలవుతుంది.

ఆ రాక్షసుడు వీరబాబును భయపెట్టడమే కాకుండా, తన గతానికి సంబంధించిన ఒక తీరని కోరికను తీర్చమని వీరబాబును వేధిస్తుంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రాక్షసుడికి సహాయం చేయడానికి వీరబాబు ఒప్పుకుంటాడు. ఈ క్రమంలో వీరబాబు ఎదుర్కొనే వింత అనుభవాలు, పడే పాట్లు ప్రేక్షకులకు ఫుల్ నవ్వులను పంచుతాయి. ఇక సెకండాఫ్ నుండి కథ మరింత వేగంగా, వినోదాత్మకంగా మారుతుంది. ఆ రాక్షసుడి కోరిక తీర్చే ప్రయత్నంలో వీరబాబుకు తోడుగా ప్రైవేట్ డిటెక్టివ్ (వెన్నెల కిషోర్), గెటప్ శ్రీను వచ్చి చేరుతారు. వీరి ముగ్గురి కాంబినేషన్‌లో వచ్చే సీన్లు థియేటర్లలో నవ్వుల పూయిస్తాయి. అటు హారర్ ఎలిమెంట్స్‌తో భయపెడుతూనే, ఇటు కామెడీతో కడుపుబ్బ నవ్వించడంలో దర్శకురాలు మానస శర్మ సక్సెస్ అయ్యారు. చివరకు ఆ బ్రహ్మ రాక్షసుడు ఎవరు? అతని కోరిక ఏంటి? వీరబాబు ఆ రాక్షసుడి నుండి ఎలా విముక్తి పొందాడు? అనే అంశాలను చాలా ఎమోషనల్ అండ్ ఫన్నీగా ముగించారు.

Next Story