సూపర్ స్టార్ అభిమానులకు హెచ్చరిక.. అలాంటి ప్రకటనలతో జాగ్రత్తగా ఉండాలంటూ ‘కూలీ’ టీమ్ షాకింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ‘కూలీ’ (coolie)సినిమాతో ప్రేక్షకులను అలరించారు.

సూపర్ స్టార్ అభిమానులకు హెచ్చరిక.. అలాంటి ప్రకటనలతో జాగ్రత్తగా ఉండాలంటూ ‘కూలీ’ టీమ్ షాకింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ‘కూలీ’ (coolie)సినిమాతో ప్రేక్షకులను అలరించారు. లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ ప్రాజెక్ట్‌లో అక్కినేని నాగార్జున, ఆమిర్ ఖాన్, శృతి హాసన్, ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 14న విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. తాజాగా, రజినీకాంత్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మలేసియాలో ఫ్యాన్స్ గ్రీట్ అండ్ మీట్ లాంటివి తాము నిర్వహిస్తున్నట్లు మాలిక్ స్ట్రీమ్స్ కార్పోరేషన్ వారు చెప్పినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలో.. తాజాగా, ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ రజినీకాంత్ అభిమానులను హెచ్చరించారు.

‘‘ప్రియమైన అభిమానుతందరికీ మేము ఓ విషయం చెప్పాలనుకుంటున్నాము. ప్రస్తుతం మాలిక్ స్ట్రీమ్స్ ప్రమోట్ చేస్తున్న ‘మీట్ అండ్ గ్రీట్ తలైవార్’ అనేది పూర్తిగా అనధికారిక ప్రకటన. ఇలాంటి ఫేక్ ప్రకటనలు ఎటువంటి ముందస్తు అనుమతి పొందకుండానే ప్రమోట్ చేస్తున్నారు. ఫేక్ వాటివల్ల అభిమానులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాటితో అభిమానులను తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. కాబట్టి తప్పుడు ప్రకటనలు నమ్మి ఎవరూ కూడా అందులో పాల్గొనవద్దని అభిమానులను, ప్రజలను గట్టిగా హెచ్చరిస్తున్నాము’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండటంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు.

link

Next Story