దేవుడిపై నమ్మకంతో అడుగు వేస్తున్నాం.. మీ ఆశీస్సులు కావాలంటూ శైలేష్ కొలను ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

నమ్ముతున్న ఒక బలమైన అనుభూతిని ప్రపంచానికి పరిచయం చేసే క్రమంలో కలిసి నిలబడ్డాము.

దేవుడిపై నమ్మకంతో అడుగు వేస్తున్నాం.. మీ ఆశీస్సులు కావాలంటూ శైలేష్ కొలను ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్(Roshan) సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్నాడు. ఇటీవల ‘ఛాంపియన్’ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న రోషన్, ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు ‘ఎమో ఎమో ఇది’(Emo emo edhi) అనే క్యూట్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో 'కన్నప్ప' ఫేమ్ ప్రీతి ముకుందన్(Preethi Mukundan) హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా.. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు చిత్ర యూనిట్ సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శైలేష్ కొలను (Sailesh kolanu)సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు. మార్చి 1వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ‘‘మూడు హృదయాలు.. ఒకే కల.. ఇదొక అందమైన ప్రారంభం. ఈరోజు కేవలం ఒక సినిమా కోసం ముహూర్తపు పూజ మాత్రమే కాదు. కొంతకాలంగా మేము నిశ్శబ్దంగా నమ్ముతున్న ఒక బలమైన అనుభూతిని ప్రపంచానికి పరిచయం చేసే క్రమంలో కలిసి నిలబడ్డాము.

‘ఎమో ఎమో ఇది’ అనేది మాకు కేవలం ఒక సినిమా పేరు మాత్రమే కాదు. మా మధ్య జరిగిన సంభాషణలు, సందేహాలు, నవ్వులు.. వీటన్నింటి సారాంశం. మేము మా హృదయాల లోతుల్లో నుంచి చెప్పాలనుకుంటున్న ఒక స్వచ్ఛమైన కథ ఇది. దేవుడిపై మరియు మీ అందరిపై నమ్మకంతో మేము రేపటి నుంచి ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాము. గతంలో మీరు మమ్మల్ని నమ్మినట్లయితే, మా కథలకు కనెక్ట్ అయినట్లు అనిపిస్తే.. మరోసారి మా వెన్నంటి నిలబడండి. మీ ప్రార్థనలలో మాకు చోటు ఇవ్వండి’’ అంటూ ఎమోషనల్‌ అయ్యారు. 'హిట్' సిరీస్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శైలేష్ కొలను, ఒక వైవిధ్యమైన టైటిల్‌తో రోషన్‌ను ఎలా ప్రెజెంట్ చేస్తారనే దానిపై టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన స్పెషల్ గ్లింప్స్‌కు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సక్సెస్ జోరు చూస్తుంటే రోషన్ తన ఖాతాలో మరో హిట్‌ను వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story