- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాళ్లకు డబ్బులు ఇచ్చి మరీ అలాంటి పనులు చేపిస్తున్నాం.. సంచలన నిజాలు బయటపెట్టిన నాగవంశీ (వీడియో)
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’(Kingdom).

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’(Kingdom). గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ(Naga Vamsi), సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 31న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత నాగవంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మీడియాతో సరైన సంబంధాలు లేకుంటే ఒక సినిమాను చంపేస్తారనే భయం ప్రతి నిర్మాతలో ఉంటుంది. గత 15 ఏళ్లుగా మేమే దానిని అలా క్రియేట్ చేసుకున్నామనిపిస్తుంది.
ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే వారిలో కొందరు పీఆర్ టీమ్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు. విడుదల తర్వాత రేటింగ్, లైకులు, మంచి రివ్యూల కోసం ఏకంగా రూ. 30 లక్షలకు పైగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. నేను ఇప్పుడు కింగ్‌డమ్ రూ. 130 కోట్లు పెట్టి తీశాను. అలాంటప్పుడు రూ. 30 లక్షల గురించి ఆలోచించాలా? అని మా టెన్షన్స్‌తో డబ్బులు పట్టించుకోవడం లేదు. ‘కింగ్‌డమ్’ ప్రోమో వచ్చింది. అన్ని వెబ్‌సైట్స్ బాగా రాశారు. నిజం చెప్పాలంటే.. ఆ కంటెంట్ బాగుండి రాశారా లేక పీఆర్ఓలు రాయించారా అనేది ఎవరికీ తెలియదు.
కానీ మేమే రాపించామని చెబుతున్నారు. బుక్‌మై షోలో మీకు కనిపించే లైక్స్, రేటింగ్స్ కూడా డబ్బులు ఇచ్చి చేపిస్తాం. అందుకే ఇలాంటి తప్పుడు ప్రమోషన్ చేయకూడదని గిల్డ్‌లో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. బుక్‌మైషో వాడికి అదనంగా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఏమైనా అంటే భయం క్రియేట్ చేస్తున్నారు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.






