‘డోంట్ బీ షై’ మూవీతో ప్రేక్షకులకు పెద్ద సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాం: ఆలియా భట్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్(Alia Bhatt).. ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా రాణిస్తూనే నిర్మాతగానూ సత్తా చాటుతోంది.

‘డోంట్ బీ షై’ మూవీతో ప్రేక్షకులకు పెద్ద సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాం: ఆలియా భట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్(Alia Bhatt).. ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా రాణిస్తూనే నిర్మాతగానూ సత్తా చాటుతోంది. త్వరలో ‘డోంట్ బీ షై’ (Don’t Be Shy) చిత్రంతో ప్రేక్షకులను అలరించనుంది. ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆలియా, షాహిన్ భట్‌లు నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ మూవీని శ్రీతి ముఖర్జీ (Shriti Mukherjee)తెరకెక్కిస్తోంది. భారతదేశంతో అత్యంత ప్రజాధరణ పొందిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ కాబోతుందని సమాచారం. ఈనేపథ్యంలో తాజాగా, లండన్ వేదికగా జరిగిన 'ప్రైమ్ వీడియో ఇంటర్నేషనల్ షోకేస్'లో ఆలియా భట్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హాలీవుడ్, కొరియన్ స్టార్ల మధ్య ఆలియా తన రాబోయే చిత్రం ‘డోంట్ బీ షై’ (Don’t Be Shy) గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

శ్యామిలి దాస్ ప్రయాణం..

ఈ సినిమా గురించి ఆలియా మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా మనం బలమైన మహిళా పాత్రల వైపు ఆకర్షితులవుతాం, కానీ ఈ సినిమాలో అబ్బాయిల పాత్రలను కూడా చాలా కొత్త కోణంలో చూపించబోతున్నాము. ఇది ఒక క్లాసిక్ సమ్మర్ హాలిడే ఫిల్మ్ లాంటి ఫీలింగ్‌ను ఇస్తుంది’’ అని చెప్పింది.ఈ చిత్రం 20 ఏళ్ల శ్యామిలి 'షై' దాస్ అనే యువతి జీవితం చుట్టూ తిరుగుతుంది. తన ప్రపంచం తన అదుపులో ఉంది అనుకుంటున్న సమయంలో.. ఒక అనూహ్య ఘటన ఆమె జీవితాన్ని ఎలా మార్చేసింది అనేదే కథాంశం. ‘‘ఈ కథలో అన్నీ ఉన్నాయి.. రొమాన్స్, హార్ట్‌బ్రేక్, పాటలు, అబ్బాయిలు, అమ్మాయిలు.. చివరకు ఒక తాబేలు (Turtle) కూడా ఉంటుంది. తాజా శక్తితో, కొత్త ఆలోచనలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతోంది’’ అని చెప్పి సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచింది.

Next Story