- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీ రెస్పాన్స్ చూసి వారం ముందుగానే వస్తున్నాం.. ‘లిటిల్ హార్ట్స్’ విడుదలపై శివాని నాగరం పోస్ట్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శివాని నాగరం(Shivani Nagaram) ‘అంబాజీ పేట మ్యారెజ్ బ్యాండ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శివాని నాగరం(Shivani Nagaram) ‘అంబాజీ పేట మ్యారెజ్ బ్యాండ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. శివాని నటిస్తున్న సినిమాల్లో ‘లిటిల్ హార్ట్స్’(Little Hearts) ఒకటి. నో టచింగ్స్.. ఓన్లీ హార్ట్ టచింగ్స్’ అనే ట్యాగ్‌లైన్‌తో రాబోతున్న ఈ చిత్రంలో మౌళి తనూజ్ హీరోగా నటిస్తున్నాడు. సాయి మార్తాండ్(Sai Marthand) దర్శకత్వంలో రాబోతుండగా.. ఈటీవీ ఒరిజినల్ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. దీనికి సిన్‌జిత్ యర్రమల్లి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
చిత్రబృందం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. నిత్యం పలు ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, శివాని నాగరం సినీ ప్రియులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. ‘‘మీ రెస్పాన్స్ చూసి వారం ముందే వచ్చేస్తున్నాం. ‘లిటిల్ హార్ట్స్’ వారం ముందుగానే.. సెప్టెంబర్ 5న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి’’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మొదటి సారి ఒక సినిమా వాయిదా పడకుండా.. ముందే వస్తుంది అని కామెంట్లు చేస్తున్నారు. ఈ చిన్న చిత్రం అనుష్క శెట్టి నటిస్తున్న ‘ఘాటి’కి పోటీగా రాబోతుండటం గమనార్హం.






