ప్రకాశ్ రాజ్‌ ఓ నక్సలైట్.. డైరెక్టర్ సంచలన కామెంట్స్

by Dishanational2 |
ప్రకాశ్ రాజ్‌ ఓ నక్సలైట్.. డైరెక్టర్ సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: నటుడు ప్రకాశ్ రాజ్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రతరమవుతోంది. 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాను విమర్శించిన ప్రకాశ్ రాజ్‌ను 'అంధకార్ రాజ్'గా పేర్కొన్న వివేక్.. 'ఆయనొక అర్బన్ నక్సలైట్' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'కశ్మీర్ ఫైల్స్ అనే చిన్న చిత్రం కొంతమంది అర్బన్ నక్సలైట్లను రాత్రిపూట నిద్ర పోనీయడం లేదు. రిలీజై ఏడాది దాటుతున్నా వాళ్లు మరిచిపోలేకపోతున్నారు. అలాంటివన్నీ మొరిగే కుక్కలు. మిస్టర్ అంధకార్ రాజ్ భాస్కర్ అవార్డులన్నీ మీకే లభిస్తుంటే ఇక మాకు చాన్స్ ఎక్కడుంది' అంటూ తనదైన స్టైల్‌లో కామెంట్స్ చేశారు. కాగా 'పఠాన్' సక్సెస్‌ను ప్రశంసిస్తూ 'ది కశ్మీర్ ఫైల్స్' టీమ్‌పై ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed