కాస్టింగ్ కౌచ్‌ అనుభవం.. ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది

by Disha Web Desk 6 |
కాస్టింగ్ కౌచ్‌ అనుభవం.. ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ వామికా గబ్బి.. ఫిల్మ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనుభవంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల వచ్చిన ‘జూబ్లీ’ వెబ్ సిరీస్‌లో తన నటనకుగానూ ప్రశంసలు అందుకున్న నటి.. రీసెంట్ ఇంటర్వ్యూలో లైంగిక వేధింపుల గురించి తన అభిప్రాయాలు వెల్లడించింది. నిజానికి తానెప్పుడూ అలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదని, ఒకవేళ భవిష్యత్తులో ఎదురైతే ఎలా స్పందిస్తానో ఊహించుకుంటే ఆశ్చర్యమేస్తుందని తెలిపింది. ‘మనమందరం ఈ విషయాల గురించి తరచూ వింటున్నాం. నాకూ అలా జరిగితే ఎలా స్పందిస్తానో తెలియదు. కానీ, ఒక మహిళగా ఎల్లప్పుడూ ఆ భయంకరమైన సంఘటన గురించి ఆలోచిస్తా. నేను పలు జాగ్రత్తలు తీసుకుంటూనే ఇతరులకు అలా జరగకుండా ఉండాలని కోరుకుంటా’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి: మా అమ్మ నా బాయ్‌ఫ్రెండ్స్‌తో డేటింగ్ చేసింది.. ఆ కోరికతోనే


Next Story