- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘భూత్ బంగ్లా’లో షాకులు, సర్‌ప్రైజులు ఉన్నాయి.. వాటిని చూసే ధైర్యం మీకుందా.. వామికా గబ్బి పోస్ట్
షాకులు, సర్‌ప్రైజులు వేచి ఉన్నాయి.. బంగ్లా లోపలికి ప్రవేశించే ధైర్యం మీకు ఉందా?

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ హారర్ కామెడీ చిత్రం ‘భూత్ బంగ్లా’ (Bhoot Bangla). సుమారు 14 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి యంగ్ బ్యూటీ వామికా గబ్బి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా టీజర్‌ను వామికా గబ్బి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే, ‘మంగళపూర్’ అనే గ్రామంలోని ‘వధుసురుడు’ అనే ఒక మిస్టరీ చుట్టూ కథ తిరుగుతుందని అర్థమవుతోంది. "బంగ్లా లోపల నవ్వులు,షాకులు, సర్‌ప్రైజులు వేచి ఉన్నాయి.. లోపలికి ప్రవేశించే ధైర్యం మీకు ఉందా?" అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో వామికా ఈ టీజర్‌ను పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుకుంటున్నారు.
ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌తో పాటు సీనియర్ నటి టబు, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. వీరితో పాటు మిథిలా పాల్కర్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తోంది. బాలాజీ టెలిఫిల్మ్స్ మరియు కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై ఏక్తా కపూర్, శోభా కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియదర్శన్ మార్క్ కామెడీకి హారర్ టచ్ తోడవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రియదర్శన్ సినిమాల్లో ఉండే ఆ గందరగోళ కామెడీ, అక్షయ్ కుమార్ టైమింగ్, వామికా గబ్బి గ్లామర్ అన్నీ కలిసి ‘భూత్ బంగ్లా’ను ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్‌గా మార్చనున్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్స్‌లోకి రాబోతుంది.






