'Walther Veeraiah' ప్రీ రిలీజ్ ఈవెంట్'కు ఆల్ ఫిక్స్

by Chukka Sudharani |   (  Updated:2022-12-14 06:16:30  IST  )

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'వాల్తేరు వీర‌య్య' షూటింగ్ తుదిద‌శ‌కు చేరుకుంది.

Walther Veeraiah ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఆల్ ఫిక్స్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'వాల్తేరు వీర‌య్య' షూటింగ్ తుదిద‌శ‌కు చేరుకుంది. ప్రస్తుతం యూర‌ప్‌లో చిరంజీవి, శృతిహాస‌న్‌ జోడీగా రెండు పాట‌ల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఇవి కాగానే షూటింగ్ మొత్తం పూర్తవుతుందని స‌మాచారం. బాబీ ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న రిలీజ్ కానుంది. డేట్ దగ్గరపడుతుండటంతో త్వర‌లోనే ప్రమోష‌న్స్ కూడా మొద‌లు పెట్టబోతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జ‌న‌వ‌రి 8న విశాఖ‌లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. చిరంజీవి, ర‌వితేజ‌తోపాటు మూవీ యూనిట్ మొత్తం ఈ వేడుకకు హాజ‌రుకానుందని సమాచారం.

Also Read....

Mahesh-Rajamouli మూవీలో Amitabh Bachchan..

Next Story