- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్‌ప్రైజ్‌లను వెండితెరపైనే చూసేందుకు వేచి ఉండండి.. దయచేసి ఫొటోలు షేర్ చేయొద్దు: సిద్ధార్థ్ ఆనంద్
అభిమానులందరికీ ఒక విన్నపం.. దయచేసి ‘కింగ్’ సెట్స్ నుంచి లీక్ అయిన ఏ ఫోటోను లేదా వీడియోను సర్క్యులేట్ చేయకండి.

దిశ, సినిమా: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కింగ్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్‌లో జరుగుతోంది. అయితే అక్కడ ఒక పాటను చిత్రీకరిస్తుండగా తీసిన కొన్ని ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. ఇందులో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె చేతులు పట్టుకుని నడుస్తూ కనిపిస్తున్నారు. దీపికా ఫ్లోరల్ ప్రింట్ గౌనులో మెరిసిపోతుండగా, షారుఖ్ మాత్రం పైన బటన్స్ పెట్టుకోకుండా, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. సెట్స్ నుంచి ఈ ఫోటోలు, వీడియోలు లీక్ అవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద కలకలం రేపుతోంది. వాటిని చూసిన ఫ్యాన్స్ ఇదొక పెయింటింగ్ లా ఉందని కొందరు అంటుంటే.. జవాన్, పఠాన్ సినిమాల కంటే షారుఖ్ లుక్ ఇందులో ఇంకా బాగుందని మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా, ఈ విషయంపై దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ట్విట్టర్ ద్వారా స్పందించి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి లీక్డ్ మెటీరియల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. "అభిమానులందరికీ ఒక విన్నపం.. దయచేసి ‘కింగ్’ సెట్స్ నుంచి లీక్ అయిన ఏ ఫోటోను లేదా వీడియోను సర్క్యులేట్ చేయకండి. మీకు ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించడం కోసం మా టీమ్ రాత్రింబవళ్లు కష్టపడుతోంది. ఆ సర్‌ప్రైజ్‌లను వెండితెరపైనే చూడాలి. మేం అనుకున్న విధంగానే ప్రమోషన్స్ ద్వారా వాటిని రివీల్ చేసే వరకు అందరూ సహకరించండి" అని కోరారు.ఈ సినిమాలో షారుఖ్, దీపికాలతో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్, రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రానుంది. షారుఖ్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.






