వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న ‘సీతారామం’.. స్పెషల్ వీడియో

by Disha Web Desk 10 |
వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న ‘సీతారామం’.. స్పెషల్ వీడియో
X

దిశ, సినిమా: ఎమోషనల్ లవ్ స్టోరీగా వచ్చిన ‘సీతారామం’ మూవీ ప్రేక్షకులను ఫుల్ ఫిదా చేసింది. 2022 ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా సుమారు రూ.30 కోట్లతో తెరకెక్కి రూ.90 కోట్ల వరకు కలెక్షన్లను సాధించింది. ఇక డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్‍గా దుల్కర్ సల్మాన్, సీతగా మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ అద్భుతం అని చెప్పాలి. కాగా నేటితో ఈ మూవీ విడుదలై సంవత్సరం పూర్తైంది. దీంతో ఏడాది పూర్తైన సందర్భంగా ఈ చిత్రాన్ని నిర్మించిన వైజయంతి మూవీస్ ఓ స్పెషల్ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో వివిధ భాషలకు చెందిన ప్రేక్షకులు మూవీకి సంబంధించి అభిప్రాయాలు తెలుపుతున్నట్లుగా ఈ వీడియోలో ఉంది. అలాగే ‘మా సినిమా ఫీల్డ్‌కు థియేటరే గుడి’ అని ప్రభాస్ చెప్పిన కామెంట్, దీంతో పాటు యూనిట్ ఎమోషనల్ దృశ్యాలు చూడొచ్చు.


Next Story

Most Viewed