గ్వాలియర్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ‘#VT13’.. వరుణ్ పిక్ వైరల్

by Disha Web Desk 23 |
గ్వాలియర్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ‘#VT13’.. వరుణ్ పిక్ వైరల్
X

దిశ, సినిమా : వరుణ్ తేజ్ హీరోగా యదార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘#VT13’. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీ తాజాగా గ్వాలియర్ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ తెలిపారు. అలాగే ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న వరుణ్ తేజ్.. ‘#VT13 గ్వాలియర్‌ షెడ్యూల్‌ను పూర్తి చేశాను! తిరిగి బేస్‌కి వచ్చాను’ అంటూ ట్విట్ చేశాడు. ఇక ఇందులో IAF ఆఫీసర్‌గా కనిపించే ఫొటోను కూడా హీరో పోస్ట్ చేయగా అది ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇదిలావుంటే.. ఇటీవల వరుణ్ తేజ్ పాత్రను భారతీయ వైమానిక దళ పైలట్‌గా పరిచయం చేసిన వీడియో సినిమాపై ఆసక్తిని పెంచేస్తుండగా మానుషి చిల్లార్ రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్‌పై సందీప్ ముద్దా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Next Story