స్పిరిట్ కోసం మ‌రో విల‌న్ దింపుతున్న సందీప్‌..ఇక థియేటర్లు బద్దలే!

by velandi.Saikiran |   (  Updated:2025-10-03 14:40:52  IST  )

సందీప్ అలాగే ప్రభాస్ కాంబినేషన్ లో స్పిరిట్ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వివేక్ ఒబెరాయ్ ని విలన్ గా నటించబోతున్నారని

స్పిరిట్ కోసం మ‌రో విల‌న్ దింపుతున్న సందీప్‌..ఇక థియేటర్లు బద్దలే!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం రాజా సాబ్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి హీరో ప్రభాస్ అదే సమయంలో సందీప్ రెడ్డి తో సినిమా కూడా చేస్తున్నాడు. సందీప్ అలాగే ప్రభాస్ కాంబినేషన్ లో స్పిరిట్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ పూర్తయిందని చెబుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి... ఇందులో ప్రభాస్ తో రొమాన్స్ చేయనుందట. అంతేకాదు ఈ మూవీలో హీరో ప్రభాస్ పోలీస్ పాత్రలు కనిపించబోతున్నారని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి.

అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ రెడ్డి.... ప్రభాస్ తో సినిమా అంటేనే ఓ రేంజ్ అంచనాలు ఉంటాయి. ఈ సినిమాలో ప్రతి సీన్ గూస్ బంప్స్ వచ్చేలా సందీప్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇందులో భాగంగానే తాజాగా మరో కీలక అప్డేట్ ఈ సినిమా గురించి వచ్చింది. ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ విలన్... రంగంలోకి దిగబోతున్నాడట. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వివేక్ ఒబెరాయ్ ని విలన్ గా నటించబోతున్నారని తెలుస్తోంది. చివరి నిమిషంలో వివేక్ కు అవకాశం ఇస్తున్నారట. ఇప్పటికే తెలుగులో రాంచరణ్ హీరోగా చేసిన వినయ విధేయ రామ సినిమాలో విలన్ గా వివేక్ పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదన్నా సంగతి తెలిసిందే. కానీ సందీప్ రెడ్డి చేతిలో పడితే కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

Next Story