RS ప్రవీణ్ కుమార్ బయోపిక్‌.. ‘ప్రవీణ్ ఐపీఎస్’నుంచి గ్లింప్స్ రిలీజ్

by Disha Web Desk 7 |
RS ప్రవీణ్ కుమార్ బయోపిక్‌.. ‘ప్రవీణ్ ఐపీఎస్’నుంచి గ్లింప్స్ రిలీజ్
X

దిశ, సినిమా: ఐరా ఇన్ఫోటైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నీల మామిడాల నిర్మాతగా తెరకెక్కిన చిత్రం ‘ప్రవీణ్ ఐపిఎస్’. మాజీ ఐపిఎస్ అధికారి, ప్రస్తుత బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బయోపిక్‌గా ఈ సినిమా రూపొందగా నందకిషోర్, రోజా హీరో హీరోయిన్లు‌గా నటించారు. ఇక దుర్గా దేవ్ నాయుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్న చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయినట్లు మేకర్స్ తెలిపారు.

ఈ సందర్భంగా మోషన్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత వివేక్ కూచిబొట్లగారు విడుదల చేశారు. చిత్ర గ్లింప్స్‌ను ప్రసాద్ ల్యాబ్‌లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ ఐపిఎస్ చిత్ర యూనిట్ సభ్యులతో పాటు నిర్మాత దామోదర్ ప్రసాద్, దర్శకుడు రమణ తేజ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు.

ఈ మేరకు నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రవీణ్ ఐపీఎస్ సినిమా ఒక మంచి కథ కథనంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తున్నారు. అదే విధంగా ప్రవీణ్ ఐపిఎస్ సినిమా సక్సెస్ సాధించి అందరికీ మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నా’ అన్నారు.

అలాగే అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ లక్ష్మీబాయి మాట్లాడుతూ.. ‘ప్రవీణ్ ఐపిఎస్ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. మోషన్ పోస్టర్, టైటిల్ అన్ని బాగున్నాయి. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బయోపిక్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమా అందరికి కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నా. చిత్ర యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్’ చెప్పారు. ఇక నవంబర్‌లో సినిమాను రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తుండగా ఎన్.ఎస్.ప్రసు సంగీతం అందించాడు. సినిమాకు కెమెరామెన్ నాగ్ సోధనపల్లి, ఎడిటర్ ఆర్.ఎం. విశ్వనాధ్ కుచనపల్లి, మేనేజర్ నవీన్ చంద్ర, లిరిక్స్ కిరణ్ ఓలేటి, రామ దుర్గం.



Next Story

Most Viewed