సేమ్ సెక్స్ మ్యారేజ్ నేరం కాదు.. స్టార్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Disha Web Desk 9 |
సేమ్ సెక్స్ మ్యారేజ్ నేరం కాదు.. స్టార్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: భారతదేశం వంటి ప్రగతిశీల దేశంలో స్వలింగ వివాహం సాధారణంగా పరిగణించబడాలని వివేక్ అగ్నిహోత్రి కోరుతున్నాడు. సుప్రీంకోర్టు తాజా తీర్పుపై స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా సేమ్ సెక్స్ రిలేషన్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ‘స్వలింగ వివాహం అనేది ‘అర్బన్ ఎనలిస్ట్’ అనేది కరెక్ట్ కాదు. చిన్న పట్టణాలు, గ్రామాలను ఎన్నడూ తరచి చూడని వాళ్లే దీన్ని ప్రశ్నిస్తున్నారు. నిజానికి సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది ఒక కాన్సెప్ట్ కాదు. ఇదిమానవ అవసరం. ఒక హక్కు. ఎలాంటి నేరం కాదు’ అంటూ తన ఒపీనియన్ షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

Next Story