సైలెంట్‌గా వచ్చి వయలెంట్ అప్‌డేట్ ఇచ్చిన విశ్వక్.. ఫిబ్రవరి 21న ‘కల్ట్’ జాతర షురూ!

by Mallepaka Hamsa |

విశ్వక్‌సేన్ మెగా ఫోన్ పట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

సైలెంట్‌గా వచ్చి వయలెంట్ అప్‌డేట్ ఇచ్చిన విశ్వక్.. ఫిబ్రవరి 21న ‘కల్ట్’ జాతర షురూ!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) మరోసారి సంచలనానికి సిద్ధమయ్యారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేసిన విశ్వక్, ఇప్పుడు 'కల్ట్' (CULT) అనే మాస్ టైటిల్‌తో బాక్సాఫీస్ వద్ద యుద్ధానికి సిద్ధమవుతున్నారు. గత కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ఈసారి తానే స్వయంగా మెగా ఫోన్ పట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. తాజాగా విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తుంటే థియేటర్లలో రచ్చ ఖాయమనిపిస్తోంది. నోట్లో సిగరెట్, చేతిలో గొడ్డలి పట్టుకుని విశ్వక్ కనిపిస్తున్న తీరు పీక్ యాక్షన్‌ను తలపిస్తోంది. ఆయన కాళ్ల కింద రక్తం ఏరులై పారుతుండటం.. ‘లైక్ ఏ కల్ట్’ అనే ట్యాగ్‌లైన్ సినిమాలోని డార్క్ అండ్ వైలెంట్ షేడ్‌ను రిప్రజెంట్ చేస్తున్నాయి.

యువతకు నచ్చే అంశాలతో పాటు, పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని విశ్వక్ మలుస్తున్నట్లు టాక్. ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ప్రసాద్ పీసీఎక్స్ (PCX) స్క్రీన్‌పై ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ భారీ ఎత్తున జరగనుంది. ‘ఫలక్‌నుమా దాస్’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి సినిమాల తర్వాత విశ్వక్ డైరెక్ట్ చేస్తున్న మూడవ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు కేవలం దర్శకత్వం మాత్రమే కాదు.. కథ, స్క్రీన్ ప్లే బాధ్యతలను కూడా విశ్వక్ సేనే స్వయంగా నిర్వహించడం విశేషం. తారక్ సినిమాస్, వన్మయ బ్యానర్స్‌పై సందీప్ కాకర్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్ మళ్లీ డైరెక్టర్ సీటులోకి రావడంతో ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story