- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ ఓవర్సీస్ రైట్స్‌ను సొంతం చేసుకున్న రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్
టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ ‘ఫలక్ నామా దాస్’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పాగల్, ఓరి దేవుడా చిత్రాలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ ‘ఫలక్ నామా దాస్’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పాగల్, ఓరి దేవుడా చిత్రాలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజాగా, విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ సినిమాతో ఫ్యాన్స్‌ను అలరించడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీని ఫిబ్రవరి 17న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల సినిమా వాయిదా వేశారు. తాజాగా, ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్‌ను ప్రముఖ సంస్థ ‘రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్’ సొంతం చేసుకుంది. ఆ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్ వేదికగా మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.
అయితే ‘ధమ్కీ’ సినిమాను మార్చి 22న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో విశ్వక్ సరసన నివేదా పేతురాజ్ నటిస్తుంది. ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. అయితే ఫిబ్రవరి 18న ప్రీరిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించడానికి మేకర్స్ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను గెస్ట్‌గా పిలిచే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Happy to annouce that we acquired overseas theatrical rights of @VishwakSenActor #Dhamki #DasKaDhamki .overseas release by @Radhakrishnaen9 @Nivetha_Tweets @Ram_Miriyala @LyricsShyam @VanmayeCreation @VScinemas_ @saregamasouth pic.twitter.com/GyESyklGDO
— Radhakrishnaentertainments (@Radhakrishnaen9) February 28, 2023






