vishwak sen: ఎన్టీఆర్ సినిమాలో విలన్‌గా విశ్వక్ సేన్?

by Disha Web Desk 10 |
vishwak sen: ఎన్టీఆర్ సినిమాలో విలన్‌గా విశ్వక్ సేన్?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రూటే సెపరేట్. హీరోనే కాకుండా దర్శకుడిగా తన సత్తా చూపించి ముందుకు వెళ్తున్నాడు. ఒక హీరో దర్శకుడిగా వ్యవహరిస్తూ.. అదే హీరోగా కూడా చేయాలంటే పెద్ద సాహసమే అవుతుంది. అలాంటి పెద్ద బాధ్యతే విశ్వక్ సేన్ తీసుకోని దాస్ కా ధమ్కీ సినిమా తానే డైరెక్టర్ , తానే హీరోగా ఆ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా ఉగాది రోజున విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబడుతుంది. మొదటి రోజునే 8 కోట్లకు పైగా గ్రాస్ , రూ. 4 కోట్లకు పైగా షేర్స్ వసూలు చేసింది. ఈ సినిమాలో విలన్‌గా , హీరోగా నటించి అందరిని మెప్పించాడు. నిజం చెప్పాలంటే విశ్వక్ నెగటివ్ రోల్లో మంచి మార్కులే వేపించుకున్నాడు. ఈ సినిమాకి సంబందించిన ఇంటర్వ్యూలో.. ఫ్యూచర్లో విలన్‌గా ఆఫర్ వస్తే నటిస్తారా ? అని అడగగా " నాకు ఆవకాశం వస్తే జూ. ఎన్టీఆర్ సినిమాలో మాత్రమే విలన్‌గా చేస్తానని" చెప్పాడు.

Next Story