Ori Devuda Movie Trailer Out : ఇష్టంలేని పెళ్లిచేసుకున్న విశ్వక్..

by Hajipasha |   (  Updated:2025-08-16 15:38:03  IST  )

తమిళ బిగ్ హిట్ మూవీ 'ఓ మై కడవలే' తెలుగులో 'ఓరి దేవుడా'పేరుతో రిమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.

Ori Devuda Movie Trailer Out : ఇష్టంలేని పెళ్లిచేసుకున్న విశ్వక్..
X

దిశ, సినిమా: తమిళ బిగ్ హిట్ మూవీ 'ఓ మై కడవలే' తెలుగులో 'ఓరి దేవుడా'పేరుతో రిమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇందులో విశ్వక్ సేన్, మిహిల పాల్కర్, ఆషాభట్ హీరో హీరోయిన్లుగా నటించారు. అశ్వత్‌ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన స‌ర్‌ప్రైజ్ గ్లింప్స్ వీడియో నెటిజన్లను ఆకట్టుకోగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఇష్టంలేని పెళ్లిచేసుకుని తన క్రష్‌ను తలచుకుంటూ 'జీవితాన్ని మార్చుకోవడం సాధ్యం కాదు. కానీ, దానికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడం సాధ్యం అవుతుంది' అనే వాయిస్ ఓవర్‌ను బట్టి చూస్తే సినిమా ఆసక్తికరంగానే ఉండేటట్లు తెలుస్తోంది. ఇక ఇంతకుమందు రిలీజ్ చేసిన వీడియోలో దేవుడి పాత్రలో దర్శనమిచ్చిన విక్టరీ వెంక‌టేశ్.. హీరోకు సలహాలిస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేశాడు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న ఈ చిత్రం రిలీజ్‌కానుంది.

Next Story