Vishwak Sen :చేయని తప్పులకు నిందలు వేశారు.. విశ్వక్ ఎమోషనల్ పోస్ట్

by Chintha Aamani |   (  Updated:2023-05-14 12:35:39  IST  )

చేయని తప్పులకు తనపై నిందలు వేయడంపై విశ్వక్ సేన్ ఎమోషనల్ అయ్యాడు. నిజంగా తాను ఇప్పటి వరకు ఎవరికీ ద్రోహం చేయలేదన్న హీరో.

Vishwak Sen :చేయని తప్పులకు నిందలు వేశారు.. విశ్వక్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా : చేయని తప్పులకు తనపై నిందలు వేయడంపై విశ్వక్ సేన్ ఎమోషనల్ అయ్యాడు. నిజంగా తాను ఇప్పటి వరకు ఎవరికీ ద్రోహం చేయలేదన్న హీరో.. తన జీవితంలో ఎన్నో జయాపజయాలను చవి చూశానన్నాడు. ‘ప్రశంసలు.. విమర్శలు.. ఈ రెండింటినీ ఎదుర్కొన్నా. హర్డ్ వర్క్ చేసినపుడు పొగడ్తలు అందుకున్నా. అయితే కొన్నిసార్లు నా ప్రమేయం లేకుండానే నాపై విష ప్రచారం జరిగింది. అయినా వాటన్నింటినీ తట్టుకుని ప్రయాణం కొనసాగిస్తున్నా. ఎందుకంటే జీవితంలో క్లిష్ట సమయాలకు మించినది ఇంకా ఉందని భావిస్తా. మనం మానవ జన్మ ఎత్తినందుకు ఆనందపడదాం. కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడదాం’ అంటూ ఇన్‌స్టా వేదికగా ఓ నోట్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్ ఎందుకు పెట్టాడో అర్థం కాక ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read..

అది అందంగా ఉన్నా అంగీకరించలేదు.. కావాలనే తొక్కేశారు


Next Story