పూర్తి యాక్షన్‌తో విశాల్ 'Latti' మూవీ ట్రైలర్

by Dishanational4 |
పూర్తి యాక్షన్‌తో విశాల్ Latti మూవీ ట్రైలర్
X

దిశ, సినిమా: తమిళ, తెలుగు భాషల్లో గ్రేట్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ గురించి మనకు తెలిసిందే. ఒకప్పుడతని మూవీ రిలీజ్ అంటేనే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్ దద్దరిల్లేది. అయితే ప్రస్తుతం సరైన హిట్ లేకపోవడంతో 'అభిమన్యుడు' సినిమా తర్వాత అతను చేసిన ప్రతీ సినిమా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అతను హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సినిమా 'లాఠీ'. వినోద్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, థియేట్రికల్ ట్రైలర్ డిసెంబర్ 13న విడుదలైంది. అయితే ట్రైలర్ హీరో విశాల్ తీవ్రంగా గాయపడ్డాడు. తన ఉద్యోగం విషయంలో ఎవరినీ పట్టించుకోని పోలీస్ కానిస్టేబుల్‌గా.. మునుపెన్నడూ లేనివిధంగా యాక్షన్‌ను ట్రైలర్‌లో చూపించాడు. హీరో కానిస్టేబుల్ పాత్రలో ఎంతో గంభీరంగా, కర్తవ్యంగా ఉన్నట్టు అనిపించింది. దీంతో అతని నిజాయితీకి, పట్టణంలో హీరోకు చాలా మంది శత్రువులు‌గా మారుతారు. వారందరితో పోరాడుతూ.. నేరస్తులతో వ్యవహరించే తీరునుబట్టి తోటి పోలీస్ ఆఫీసర్లు విశాల్‌ను లాఠీ అని పిలుస్తున్నారు. మొత్తానికి ఈ యాక్షన్ మూవీ భారీ అంచనాలతో ఈ నెల 22న విడుదల కానుంది.

Also Read: క్షణక్షణం భయంతో అనుపమా.. అసలు ఏం జరిగిందంటే..

Next Story

Most Viewed