vishal: 49 ఏళ్లకు పెళ్లి చేసుకుని ఏం చేస్తావ్ బ్రో.. హీరో ఎంగేజ్‌మెంట్‌పై నెటిజన్లు దారుణ ట్రోల్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-29 08:09:37  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్(vishal), సాయి ధన్సిక(Sai Dhansika)తో ప్రేమలో ఉన్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

vishal: 49 ఏళ్లకు పెళ్లి చేసుకుని ఏం చేస్తావ్ బ్రో.. హీరో ఎంగేజ్‌మెంట్‌పై నెటిజన్లు దారుణ ట్రోల్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్(vishal), సాయి ధన్సిక(Sai Dhansika)తో ప్రేమలో ఉన్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఓ సినిమా ఫంక్షన్‌లో భాగంగా ప్రేమ విషయాన్ని ప్రకటించారు. నడిగర్ సంఘం భవనం ప్రారంభోత్సవం తర్వాత వివాహం చేసుకోనున్నట్లు వెల్లడించారు. దీంతో అంతా విశాల్ పెళ్లి డేట్ అనౌన్స్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, విశాల్ ట్విట్టర్ ద్వారా తన ఎంగేజ్‌మెంట్ ఫొటోలను షేర్ చేసి అందరినీ షాక్‌కు గురిచేశారు. విశాల్, సాయిధన్సిక చెన్నైలో కుటుంబ సభ్యుల సమక్షంలో రింగులు మార్చుకున్నారు. ఈ వేడక సింపుల్‌గా జరిగింది. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా తన జీవితంలోకి ధన్సికను స్వాగతించాడు.

ఈ విషయాన్న సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ..‘‘నా ప్రత్యేకమైన పుట్టినరోజు సందర్భంగా నేను ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాను. ఈ ప్రపంచంలో.. ప్రతి మూల నుంచి నన్ను ఆశీర్వించినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు జరిగిన నా నిశ్చతార్థం శుభవార్తను పంచుకోవడం ఆనందంగా అనిపిస్తుంది. సాయిధన్సికతో పాటు మా కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి. ఈ అనుభూతిని నేను మాటల్లో చెప్పలేను. ఎప్పటిలాగే మీ ఆశీర్వాదాలు, మంచి వైబ్‌లను కోరుకుంటున్నాను’’ అని రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. అలాగే మరికొందరు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. 49 ఏళ్లకు పెళ్లి చేసుకుని ఏం చేస్తావ్ బ్రో అని దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఆగస్టు 29న విశాల్, సాయిధన్సిక పెళ్లి కావాల్సి ఉండగా.. నడిగర్ సంఘం భవన నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంతో వివాహాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

link

Next Story