- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై విశాల్ సీరియస్.. క్షమాపణ చెప్పాలని డిమాండ్!
తెలుగు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఇటీవల ఒక ప్రోగ్రామ్‌లో మాట్లాడిన మాటలు చూసి నేను చాలా బాధపడ్డాను.

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు సినీ పరిశ్రమల మధ్య చిచ్చు రేపాయి. కత్తి కాంతారావు జాతీయ పురస్కార ప్రదానోత్సవంలో ఆయన చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది. దివంగత నటుడు కాంతారావు గారి గొప్పతనాన్ని వివరిస్తూ, తమిళ ప్రజల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి ఎం.జి. రామచంద్రన్ (MGR) గారిని కించపరిచేలా మాట్లాడటంపై కోలీవుడ్ యాక్టర్స్ మండిపడుతున్నారు.. తాజాగా, రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై కోలీవుడ్ హీరో విశాల్ ఘాటుగా స్పందించారు. ‘‘తెలుగు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఇటీవల ఒక ప్రోగ్రామ్‌లో మాట్లాడిన మాటలు చూసి నేను చాలా బాధపడ్డాను. సర్, మీకు ఒక విషయం చెప్పాలి.. తమిళనాడులో ఎంజీఆర్ (MGR) గారు అంటే కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఆయన మా అందరికీ ఒక గొప్ప దైవం లాంటి నాయకుడు.
ఆయన గురించి మీరు తక్కువ చేసి మాట్లాడటం అస్సలు బాలేదు. మీరు మరో గొప్ప నటుడు కాంతారావు గారి గురించి గొప్పగా చెప్పడం చాలా మంచి విషయం. కానీ, ఒకరిని పొగిడే క్రమంలో మరొక మహానుభావుడిని కించపరచడం కరెక్ట్ కాదు. ఇది తమిళ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. మీలాంటి పెద్ద నటుడికి ఈ విషయం చెప్పడం నాకు బాధగా ఉన్నా తప్పడం లేదు. పెద్ద మనసుతో మీరు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పి, ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని కోరుతున్నాను. భవిష్యత్తులో మీ స్థాయి ఉన్న నటులను ఎవరైనా ఇలాగే తక్కువ చేసి మాట్లాడితే, నేను మీ కోసమైనా అలాగే స్పందిస్తాను. కాబట్టి, ప్లీజ్ దీనిపై స్పందించి క్షమాపణ చెప్పండి" అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






