ఓటీటీలో ‘విరూపాక్ష’ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..!

by Mallepaka Hamsa |   (  Updated:2023-05-06 09:50:12  IST  )

మెగా హీరో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన చిత్రం ‘విరూపాక్ష’.

ఓటీటీలో ‘విరూపాక్ష’ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..!
X

దిశ, వెబ్ డెస్క్: మెగా హీరో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన చిత్రం ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 21 న తెలుగులో విడుదలైంది. ఈ మూవీ విడుదలైన తొలి రోజు తోనే పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. వీరూపాక్ష సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. అయితే ‘విరూపాక్ష’ సినిమా భారీగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. తాజాగా, ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మే 20న స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో రానున్నట్లు తెలుస్తోంది.

Also Read..

OTT Movies: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, కన్నడ ,హిందీ, మరాఠీ సినిమాలివే!

Next Story