ఉదయ్‌పూర్‌లో ‘విరోష్’ వెడ్డింగ్ హంగామా షురూ.. విజయ్ దేవరకొండ పోస్ట్‌‌తో అంతా షాక్!

by Mallepaka Hamsa |

రష్మిక, విజయ్ దేవరకొండ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఉదయ్‌పూర్‌లో ‘విరోష్’ వెడ్డింగ్ హంగామా షురూ.. విజయ్ దేవరకొండ పోస్ట్‌‌తో అంతా షాక్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna)ల వివాహ వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో అట్టహాసంగా మొదలయ్యాయి. ఇప్పటికే ఈ జంట తమ కుటుంబ సభ్యులతో కలిసి వేదిక వద్దకు చేరుకోగా, నేటి నుంచి వరుసగా వివాహ వేడుకలు జరగనున్నాయి. ‘ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ పేరుతో జరుగుతున్న ఈ పెళ్లికి సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా, రష్మిక, విజయ్ దేవరకొండ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ పెళ్లికి వచ్చే అతిథుల కోసం ఈ జంట ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా భోజనం విషయంలో రష్మిక ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అతిథుల కోసం సిద్ధం చేసిన మెనూ కార్డును షేర్ చేసింది.

ఇందులో భారతీయ వంటకాలతో పాటు, జపనీస్ వంటకాలకు పెద్ద పీట వేయడం విశేషం. వినూత్నమైన రుచులతో అతిథులకు విందు ఇవ్వాలని ఈ జంట ప్లాన్ చేసింది. ఇక విజయ్ దేవరకొండ తన స్టైల్‌లో బ్యాచిలర్ పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్‌లో తన స్నేహితులతో కలిసి చేసుకున్న పార్టీ ఫోటోలను విజయ్ షేర్ చేయగా, అవి చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. షర్ట్ లేకుండా పూల్‌లో ఫుట్‌బాల్ ఆడుతున్న ఫోటోతో పాటు, గ్లాసులతో ఎంజాయ్ చేస్తున్న పిక్స్‌ను షేర్ చేస్తూ తన బ్యాచిలర్ లైఫ్‌కు గ్రాండ్ ముగింపు పలికారు. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా.. ఇదెం వేరైటీ పార్టీ అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇక వీరి పెళ్లి వేడుకల విషయానికొస్తే.. ఫిబ్రవరి 24న మెహందీ కార్యక్రమంగా జరగనుండగా.. ఫిబ్రవరి 25న హల్దీ వేడుకలు జరగనున్నట్లు సమాచారం. మొత్తానికి విజయ్-రష్మిక ఒక్కటి కాబోతుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story