రెండోసారి తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ.. అనుష్క బేబీ బంప్ వీడియో వైరల్

by Disha Web Desk 6 |
రెండోసారి తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ.. అనుష్క బేబీ బంప్ వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి అనుష్క శర్మ, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఇప్పటికే ఓ కూతురు ఉంది. అయితే వీరిద్దరూ మరో బిడ్డకు జన్మినవ్వబోతునట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ వారిద్దరు మాత్రం స్పందించడం లేదు. ఎన్ని వార్తలు వచ్చినా రెండవ బిడ్డ గురించి అసలు విషయం రివీల్ చేయడం లేదు. వారి పని వారు చూసుకుంటూ ఉంటున్నారు.

తాజాగా, అనుష్క బేబీ బంప్ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అసలు విషయంలోకి వెళితే.. అనుష్క తన భర్తతో కలిసి ఒక హోటల్ వెలుపల నడుస్తూ కెమెరాలకు కనిపించారు. అందులో అనుష్క బేబీ బంప్ క్లియర్ కనిపించింది. దీంతో విరాట్-అనుష్క మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అలాగే ఛోటా విరాట్ రాబోతున్నాడని కామెంట్లు పెడుతూ.. వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతానికి ఈ విషయంపై విరాట్- అనుష్క జంట అధికారికంగా ప్రకటించలేదు.



Next Story

Most Viewed