Prema desam Movie: సరికొత్త హంగులతో 'ప్రేమదేశం' రీ రిలీజ్

by Disha Web Desk 17 |
Prema desam Movie: సరికొత్త హంగులతో ప్రేమదేశం రీ రిలీజ్
X

దిశ, సినిమా: పాతికేళ్ల క్రితం విడుదలైన 'కాదల్ దేశం' తెలుగులో 'ప్రేమ దేశం' అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పట్లో కాలేజీ స్టూడెంట్స్ క్లాసులు బంక్ కొట్టి మరీ ఈ సినిమాను చూశారు. ఖతిర్‌ దర్శకత్యంలో అబ్బాస్, వినీత్, టబు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. ఈ మూవీ పాటల కారణంగా ఇంకా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది.

ఇక ఇప్పుడు టాలీవు‌డ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగా 'ప్రేమ దేశం' సినిమా తెలుగు వెర్షన్‌ సరికొత్త హంగులతో 9వ తేదీన రీ రిలీజ్ కానుంది. శ్రీ మాతా క్రియేషన్స్ బ్యానర్‌పై రఘురాం రెడ్డి, రవికాంత్ రెడ్డి, నాగరాజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అప్పట్లో ప్రింట్ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు సినిమాలన్నీ డిజిటల్ వెర్షన్‌లో ప్రసారం అవుతున్నాయి. దీంతో ఈ సినిమాను డిజిటల్‌గా కన్వర్ట్ చేసి లేటెస్ట్ సౌండ్ సిస్టమ్‌ను యాడ్ చేసి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.

ఇక ఈ మూవీ స్పెషల్ షో హైదరాబాద్‌లో వేశారు. దివి, శ్రేయ ప్రియ, అర్జున్ కళ్యాణ్, ఈ స్పెషల్ షో‌కు హాజరయ్యారు. అలాగే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన నిర్మాత కె.టి.కుంజుమొన్ కూడా హాజరై 'ప్రేమదేశం' సినిమా విశేషాలు మీడియాతో పంచుకున్నాడు.

READ MORE

'ముఖచిత్రం' సినిమాకు ఏ సర్టిఫికెట్‌ జారీ చేసిన సీబీఎఫ్‌సీ



Next Story

Most Viewed