- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మెగా హీరో చేతుల మీదుగా 'వినరో భాగ్యము విష్ణుకథ' ట్రైలర్ రిలీజ్
దిశ, సినిమా: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధానపాత్రలో వస్తున్న తాజా చిత్రం 'వినరో భాగ్యము విష్ణుకథ'. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా విడుదల కానున్న ఈ మూవీ నుంచి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో ప్రేమ, ఫన్, ఎంటర్టైన్మెంట్ ఆసక్తికరంగా ఉన్నాయని, మూవీ బిగ్ హిట్ కావాలని కోరుకుంటూ టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే ఈ ట్రైలర్‌లో వచ్చే బాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరోస్థాయికి తీసుకువెళ్లిందని, ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని బలంగా నమ్ముతున్నట్లు దర్శకనిర్మాతలు తెలిపారు. కశ్మీరా కథానాయికగా నటించిన చిత్రంలో మురళీ శర్మ కీలక పాత్రలో కనిపించనుండగా చేతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు.