‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారు..!

by Mallepaka Hamsa |   (  Updated:2023-03-27 11:55:11  IST  )

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు..

‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారు..!
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. కిరణ్ అబ్బవరం, మురళి కిషోరు అబ్బూరి కాంబినేషన్‌లో ఇటీవల వచ్చిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఇందులో కశ్మీర పరదేశి కథానాయికగా నటించింది. ఈ మూవీ ఫిబ్రవరి 17న థియేటర్స్‌లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దీంతో కిరణ్ అబ్బవరంకు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ వచ్చింది. తాజాగా, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ కోనుగోలు చేసింది. మార్చి 25 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

Next Story