బాలయ్యతో వ‌రుస‌గా ఆఫ‌ర్లు..రిజెక్ట్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవ‌రంటే ?

by velandi.Saikiran |   (  Updated:2026-04-22 14:41:15  IST  )

తనకు లేడీ ఓరియంటెడ్ క‌థ‌లు బాగా రావ‌డంతో పాటు పెరిగిన రెమ్యూనరేషన్ కారణంగా బాల‌య్య‌తో సినిమాలు చేయ‌డం కుదరలేదని తెలిపారు విజ‌య‌శాంతి.

బాలయ్యతో వ‌రుస‌గా ఆఫ‌ర్లు..రిజెక్ట్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవ‌రంటే ?
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ గా రాణించడమే కాదు, లేడి ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు రాములమ్మ. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య లాంటి వాళ్ల‌తోనే కాకుండా అంత‌కంటే ముందు తరాల హీరోల సరసన కూడా విజయశాంతి నటించి ఇరగదీశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి, గతంలో పార్లమెంటు సభ్యురాలిగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. అయితే అలాంటి విజయశాంతి గురించి ఓ షాకింగ్ నిజం బయటకు వచ్చింది. ఆమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నప్పుడు నందమూరి బాలయ్య సరసన నటించేందుకు చాలా అవకాశాలు వచ్చాయట.

అప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో 17 సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ ఆఫర్లు వచ్చినా కూడా విజయశాంతి రిజెక్ట్ చేశారట. తాజాగా ఈ విషయాన్ని స్వయంగా విజయశాంతి తెలిపారు. నందమూరి బాలయ్యతో అవకాశాలు వచ్చినా కూడా ఒప్పుకోకపోవడానికి ఓ ప్రత్యేక కారణాన్ని వెల్లడించారు రాములమ్మ. తనకు లేడీ ఓరియంటెడ్ క‌థ‌లు బాగా రావ‌డంతో పాటు పెరిగిన రెమ్యూనరేషన్ కారణంగా బాల‌య్య‌తో సినిమాలు చేయ‌డం కుదరలేదని తెలిపారు. హీరో రేంజ్ లో విజ‌యశాంతికి రెమ్యూన‌రేష‌న్ ఇవ్వ‌డానికి నిర్మాత‌లు ముందుకు రాలేద‌ట‌. ఆర్థిక భారం అవుతుంద‌ని వేరే హీరోయిన్ల‌ను ఫైన‌ల్ చేసిన‌ట్లు టాక్‌. కాగా రీ-ఎంట్రీలో విజ‌య శాంతి చాలా భిన్న‌మైన సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు.. అది నిజం కావడం దురదృష్టకరం: Mamitha Baiju

Next Story