ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు.. అది నిజం కావడం దురదృష్టకరం: Mamitha Baiju

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-22 14:17:25  IST  )

సోషల్ మీడియాలో అబద్ధాలు కూడా ప్రచారం అవుతుంటాయని అనుకున్నా. కానీ అది నిజమని తెలిసి చాలా బాధపడ్డాను.

ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు.. అది నిజం కావడం దురదృష్టకరం: Mamitha Baiju
X

దిశ, సినిమా: మలయాళీ ముద్దుగుమ్మ మమితా బైజు, ‘ప్రేమలు’ సినిమాతో ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారి, ఇప్పుడు సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో వరుస ప్రాజెక్టులతో ఈ భామ ఫుల్ బిజీగా గడుపుతోంది. తాజాగా మమిత ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, త్వరలో విడుదల కాబోతున్న సినిమాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. దళపతి విజయ్ హీరోగా, హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జన నాయగన్’ చిత్రంలో మమితా బైజు ఒక కీలక పాత్ర పోషించింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా, ప్రియామణి ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా సెన్సార్ సమస్యల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే, ఈ సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడంపై మమిత తీవ్ర విచారం వ్యక్తం చేసింది. "ఈ విషయం నా తమ్ముడి ద్వారా తెలిసినప్పుడు మొదట నమ్మలేదు.

సోషల్ మీడియాలో అబద్ధాలు కూడా ప్రచారం అవుతుంటాయని అనుకున్నా. కానీ అది నిజమని తెలిసి చాలా బాధపడ్డాను. టీమ్ అంతా ఎంతో కష్టపడి చేసిన సినిమా ఇలా లీక్ అవ్వడం దురదృష్టకరం" అని ఆమె పేర్కొంది. ధనుష్ సరసన నటిస్తున్న ‘కర’ సినిమా గురించి చెబుతూ ఆయన డెడికేషన్‌ను మమిత కొనియాడింది. "ధనుష్ గారు పని పట్ల చూపించే నిబద్ధత అద్భుతం. రోజంతా కష్టపడినా ఆయన ముఖంలో అలసట కనిపించదు. రొటీన్ పాత్రలు చేయకుండా ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్తదనాన్ని అందించడానికి ఆయన ప్రయత్నిస్తారు. నాకు ఆయన నటించిన ‘వీఐపీ’ అంటే చాలా ఇష్టం" అని చెప్పుకొచ్చింది. కేవలం ఈ రెండు సినిమాలే కాకుండా, ఇదాయం మురళి, కోలీవుడ్ స్టార్ సూర్య సరసన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంలో కూడా మమిత హీరోయిన్‌గా నటిస్తోంది. తనదైన సహజసిద్ధమైన నటనతో, క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ‘ప్రేమలు’ బ్యూటీ, రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది.

పెళ్లికి ముందు రోజు రాత్రే షూటింగ్...టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ నిర్ణ‌యం

Next Story