- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లికి ముందు రోజు రాత్రే షూటింగ్...టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం !
పెళ్లి కంటే ఒక్కరోజు ముందుగానే చిన్నదమ్మే చీకులు కావాలా నా సామిరంగ అనే సాంగ్ లో రమ్యకృష్ణ మెరిశారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు హీరోయిన్ గా, నెగిటివ్ రోల్ లోనూ నటించి అందరిని మెప్పించారు రమ్యకృష్ణ. ఇక ప్రస్తుతం హీరో లేదా హీరోయిన్ తల్లి పాత్రల్లో మెరుస్తున్నారు. ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి 260కి పైగా సినిమాల్లో నటించిన రమ్యకృష్ణ, సింహాద్రి షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు.
అర్ధరాత్రి 2 గంటల వరకు షూటింగ్
తన పెళ్లి కంటే ఒక్కరోజు ముందు కూడా అర్ధరాత్రి రెండు గంటల వరకు షూటింగ్ లో పాల్గొన్నారు రమ్యకృష్ణ. ఈ విషయాన్ని స్వయంగా రమ్యకృష్ణ పంచుకున్నారు. దీంతో ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సింహాద్రి సినిమా 2003 సమయంలో వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ మూవీలో చిన్నదమ్మే చీకులు కావాలా నా సామిరంగ అనే సాంగ్ లో రమ్యకృష్ణ మెరిశారు. అయితే ఈ సాంగ్ ను చివరి క్షణంలో ఫైనల్ చేశారట. దీంతో తన పెళ్లి కంటే ఒక్కరోజు ముందు కూడా షూటింగ్ లో పాల్గొని.. ఫినిష్ చేశారట రమ్యకృష్ణ. పెళ్లి రేపు అనగా ఒక రోజు ముందు అర్ధరాత్రి రెండు గంటల వరకు ఈ సాంగ్ షూటింగ్ జరిగినట్లు రమ్యకృష్ణ తాజాగా వెల్లడించారు. ఆ తర్వాతే పెళ్లికి వెళ్లారట. ఇంత డెడికేషన్ తో పనిచేసిన రమ్యకృష్ణ, ఈ సినిమా తర్వాత మంచి పేరు దక్కించుకున్నారు. కాగా రమ్యకృష్ణ, కృష్ణవంశీ 2003లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.






