దంగల్ బ్యూటీతో విజయ్ వర్మ డేటింగ్.. సెన్సేషనల్ పోస్ట్‌తో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన తమన్నా

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia) వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది.

దంగల్ బ్యూటీతో విజయ్ వర్మ డేటింగ్.. సెన్సేషనల్ పోస్ట్‌తో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన తమన్నా
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia) వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. అంతేకాకుండా ఐటెం సాంగ్స్‌లోనూ చిందులేస్తున్న ఈ భామ భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక తమన్నా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆమె కొద్దికాలంపాటు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ(Vijay Verma)తో డేటింగ్ చేసింది. ఇక వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే క్రమంలో బ్రేకప్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరు ఓ ఈవెంట్‌లో కనిపించడంతో ఈ వార్తలకు చెక్ పడినట్లు అయింది. అయితే గత కొద్ది రోజులనుంచి విజయ్ వర్మ దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్‌(Fatima Sana Sheikh)తో డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆమె క్లోజ్‌గా ఉన్న వీడియో వైరల్ కావడంతో అంతా తమన్నాతో బ్రేకప్ అయినట్లు ఫిక్స్ అయిపోయారు.

అయితే ఫాతిమా, విజయ్ నిత్యం పలు చోట్లకు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, తమన్నా ఇన్‌స్టా ద్వారా షేర్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆమె నమ్మకం మీద ఆ పోస్ట్ పెట్టడంతో విజయ్ వర్మ గురించి అని అంతా అభిప్రాయపడుతున్నారు. అసలు అందులో ఏముందంటే.. ‘‘కొన్ని డిజైన్‌లలో తెలుపు రంగు ఎక్కువగా కనిపించవచ్చు. అలా అని దాన్ని తప్పుపటొద్దు. దాని వెనకా వేరే కారణం ఉండొచ్చు. అన్ని సార్లు మనం అనుకున్నవి అన్నీ జరగకపోవచ్చు. అయినప్పటికీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రతి అంగుళం మనం పూర్తి చేయకపోవడం కూడా నిజమైన విశ్వాసమే అవుతుంది’’ అని రాసి ఉన్న కొటేషన్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది చూసిన వారు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Next Story