- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగార్జునకు ఆ టెస్టులు చేయించాలి.. అప్పుడే అసలు నిజాలు తెలుస్తాయంటూ విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi), నాగార్జున(Nagarjuna), మోహన్ లాల్ (Mohanlal)కలిసి జియో హాట్‌స్టార్ నిర్వహించిన సౌత్ అన్‌బౌండ్ అనే ఈవెంట్‌లో పాల్గొన్నారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi), నాగార్జున(Nagarjuna), మోహన్ లాల్ (Mohanlal)కలిసి జియో హాట్‌స్టార్ నిర్వహించిన సౌత్ అన్‌బౌండ్ అనే ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఇక ఇందులో విజయ్ సేతుపతి, కింగ్ నాగార్జునపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ‘‘నా పిల్లలు కూడా పెద్దవాళ్లు అయ్యారు. కానీ నాగార్జున మాత్రం ఇప్పటిక 30 ఏళ్ల హీరోలా కనిపిస్తున్నారు. అసలు ఆయన వయసు పెరగడం లేదు? ఏ మ్యాజిక్ జరగుతుందో అర్థం కావడం లేదు. యాంటీ ఏజింగ్ పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు మందుగా నాగార్జునపై టెస్టులు చేయాలి. కొన్ని రోజులు ఆయనను పరీక్షించాలని కోరుకుంటున్నాను.
అప్పుడే ఆయన వయసు ఎందుకు పెరగడం లేదనే సీక్రెట్ బయటపడుతుంది. నాగ్ జుట్టు ఒక్క తెల్ల వెంట్రుక కూడా లేకుండా అలాగే నలుపుగానే ఉండటంతో పాటు ఎనర్జీ మాత్రం రోజురోజుకు పెరిగిపోవడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎన్ని సినిమాలు చేసినా, ఎంత బిజీగా ఉన్నా ఎంత పెద్ద స్టార్ అయినా నాగార్జున ప్రతిసారి స్క్రీన్‌పై కనిపించే తీరు మాత్రం యూత్‌ఫుల్‌గా, స్టైలిస్ట్‌గా అలరిస్తూ ఉంటారు’’అని అన్నారు. ప్రస్తుతం విజయ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా.. విజయ్ సేతుపతి ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. రియాలిటీ షో బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం విజయ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు చేసుకుని ఈ చిత్రంలో సంయుక్త మీనన్, టబు, విజయ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విజయ్ సేతుపతి, పూరి కాంబోలో రాబోతున్న మొదటి ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులకు సంబంధించిన వివరాల తప్ప ఎలాంటి అప్డేట్ రావకపోవడం గమనార్హం. ఇక సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వచ్చాయా? అని ఎదురుచూస్తున్నారు.






